సాయి తేజ్ ఆరోగ్యం పై తాజా బులెటిన్..అప్డేట్ ఇదే..!

Published on Sep 14, 2021 3:24 pm IST

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. మరి తన ఆరోగ్యం పరిస్థితిపై ఆసుపత్రి సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు వారు కొట్టాడు అప్డేట్ ని పొందుపరిచారు..

ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అలాగే వీనింగ్ పద్దతిలో శ్వాస అందిస్తున్నామని తెలిపారు. బయోమెడికల్ టెస్టులు, అంతే కాకుండా ఒక ఎక్స్పర్ట్ టీం అంతా కూడా సాయి తేజ్ ఆరోగ్యాన్ని ఎప్పుడుకప్పుడు దగ్గర ఉండి పరిశీలిస్తూనే ఉన్నారని లేటెస్ట్ బులెటిన్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. మరి తేజ్ మరింత త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం..

సంబంధిత సమాచారం :