విజయ్, వెంకట్ ప్రభు సినిమా మెయిన్ నటీనటులు వీళ్ళే.!

Published on Oct 3, 2023 9:00 am IST

ప్రస్తుతం ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ రాజ్ కాంబినేషన్ లో తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “లియో” రిలీజ్ తో అంతా ఆసక్తిగా మారగా మరోపక్క ఈ చిత్రం అనంతరం విజయ్ నటించనున్న తన 68వ సినిమా కోసం కూడా టాక్ నడుస్తుంది. ఈ సినిమా గ్రాండ్ లాంచ్ మేకర్స్ ఇప్పుడు ప్లాన్ చేయగా ఈ సినిమాని అయితే దర్శకుడు వెంకట్ ప్రభు ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్ తో ప్లాన్ చేస్తున్నట్టుగా కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.

మరి ఈ టాక్ ప్రకారం ఈ చిత్రంలో విజయ్ సహా హీరోయిన్ మీనాక్షి చౌదరి నటి స్నేహ, నటుడు జైరాం అలాగే జీన్స్ నటుడు ప్రశాంత్ అలాగే ప్రభుదేవా మరియు మోహన్ లు ఈ చిత్రంలో ప్రధాన నటీ నటులుగా కనిపించనున్నారట. దీనితో ఈ కాస్ట్ అయితే ఇపుడు వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు భారీ లెవెల్లో ప్లాన్ చేస్తుండగా యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :