ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హంగామా ఎలా నడుస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇంకా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల విషయం మరింత హంగామాగా మారింది. ఏపీలో అయితే అనేకమంది సినీ ప్రముఖులు నేరుగా వెళ్లి ప్రచారం కూడా చేస్తున్నారు.
మరి ఎమ్మెల్యే సహా ఎంపీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో జరగనుండగా తెలంగాణాలో ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే దాదాపు మన తెలుగు సినిమాకి చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతల ఓట్లు తెలంగాణాలోనే ఉన్నాయి కావున ప్రముఖులు అంతా ఎవరెవరు ఎక్కడెక్కడ తమ ఓటు హక్కులు వినియోగించుకోనున్నారో వివరాలు చూసినట్టు అయితే..
మొదటిగా ఓబుల్‌రెడ్డి స్కూల్ లో
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి దంపతులు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ జూబ్లీహిల్స్ లో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్ లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు, నమ్రత అలాగే మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్, విజయ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ,శ్రీకాంత్ , జీవిత రాజశేఖర్ లు ఎఫ్‌ఎన్‌సీసీ లో రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్ , విశ్వక్‌సేన్ , దగ్గుబాటి రాణా, సురేశ్ బాబు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.
అలాగే జూబ్లీహిల్స్ క్లబ్ లో
అలాగే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్ లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.
జూబ్లీ హిల్స్ న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ లో
మాస్ మహారాజ్ రవితేజ
అలాగే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో
అక్కినేని ఫ్యామిలీ అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్
మణికొండ హైస్కూల్ లో
విక్టరీ వెంకటేశ్, హాస్య బ్రహ్మానందం
షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్
దర్శక దిగ్గజం రాజమౌళి, రామారాజమౌళి దంపతులు
బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలని లో
హీరో ఉస్తాద్ రామ్ పోతినేని
గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాల లో
హీరో నాని
దర్గా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లో
హీరో సుధీర్ బాబు
రోడ్ నెం.45, జూబ్లీహిల్స్ –ఆర్థిక సహకార సంస్థ
హీరో అల్లరి నరేశ్
యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల
వెర్సటైల్ నటులు, రచయిత తనికెళ్ల భరణి లు తమ ఓటు హక్కులని వినియోగించుకోనున్నారు.