సామజవరగమనా సాంగ్ మలయాళ వర్షన్ కూడా వచ్చేసింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సాంగ్ మరి మలయాళంలో ఎన్ని సంచలనాలు నమోదు చేయనుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే మలయాళ వర్షన్ లో సామజవరగమనా సాంగ్ సింగర్ ని మార్చేశాడు థమన్. మలయాళ వర్షన్ ని ప్రముఖ గాయకుడు యేసుదాస్ కొడుకు విజయ్ యేసుదాస్ చే పాడించారు. ఇప్పటికే 300పాటలకు పైగా పాడిన విజయ్ ఈ పాటను అద్భుతంగా పాడారు. తెలుగులో ఈ పాటను యంగ్ సెన్సేషన్ సిధ్ శ్రీరామ్ పాడిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అలవైకుంఠపురంలో టీమ్ పాటల చిత్రీకరణ కొరకు ఫ్రాన్స్ వెళ్లారు. అక్కడ అందమైన లొకేషన్స్ లో హీరోహీరోయిన్స్ పై సాంగ్స్ తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక మరియు హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా టబు, సుశాంత్, నివేదా పేతురాజ్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.
సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
