ప్రభాస్, సుకుమార్ ప్రాజెక్ట్ పై వచ్చేసిన క్లారిటీ.!

ప్రభాస్, సుకుమార్ ప్రాజెక్ట్ పై వచ్చేసిన క్లారిటీ.!

Published on Dec 27, 2022 3:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఒకో సినిమాపై కూడా ఒకో రకం హైప్ ఉంది. ఇలా అనేక భారీ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని అలరించే ప్రయత్నం చేస్తున్న డార్లింగ్ నెక్స్ట్ మరిన్ని సినిమాల లైనప్ లో పడ్డాడని అలాగే వీటిలో ఆయితే మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు అయినటువంటి సుకుమార్ తో ఓ సినిమా చేస్తున్నట్టుగా కొన్ని రూమర్స్ అయితే వినిపించాయి.

అలాగే ఈ చిత్రాన్ని అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు చేస్తున్నట్టుగా కూడా టాక్ రాగ దీనిపై అయితే ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వార్తలు ఎవరు నమ్మొద్దని సెన్సేషనల్ క్లారిటీ ఇచ్చి ఖండించింది. తమ నుంచి మరిన్ని మంచి చిత్రాలు డెఫినెట్ గా వస్తాయి కానీ ఇప్పుడు వినిపిస్తున్న రూమర్స్ మాత్రం ఎలాంటి నిజం లేదని ఓ ప్రెస్ నోట్ తో క్లారిఫై చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు