ట్రైలర్ తో దద్దరిల్లిపోయేలా ‘సరిలేరు నీకెవ్వరు’ !

సూపర్ స్టార్ మహేష్ బాబు – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న క్రేజీ కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ట్రైలర్ కోసం అభిమానులతో పాటు యావత్తు ప్రేక్షక లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది. కాగా వారి ఆసక్తిని ఇంకా డబుల్ రెట్టింపు చేస్తూ ఫ్యాన్స్ పెట్టుకున్న భారీ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా ట్రైలర్ పవర్ ఫుల్ గా వచ్చేసింది.

ట్రైలర్ లో మంచి ఫన్ అండ్ హెవీ యాక్షన్ తో పాటు ఎమోషన్ అండ్ మహేష్ బాబు లుక్ అండ్ స్టైల్, అనిల్ రావిపూడి టేకింగ్ అండ్ టైమింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే మహేష్ బాబు పాత్రతో పాటు విజయశాంతి పాత్రను కూడా బాగా ఎలివేట్ చేశారు. రష్మిక ఫ్యామిలీని, ప్రకాష్ ట్రాక్ ను కూడా బాగా ఎలివేట్ చేశారు. ఇక చివర్లో మహేష్ బాబు పలికిన బొమ్మ దద్దరిల్లిపోద్ది డైలాగ్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. వీటికి తోడు బ్యూటిఫుల్ విజువల్స్ తో ట్రైలర్ సినిమా పై అంచనాలను ఇంకా పెంచేసింది. మొత్తానికి ఈ ట్రైలర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

కాగా రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ లో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version