అద్భుత విజువల్స్ తో అదరగొడుతున్న ‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్ !

Published on Nov 1, 2021 11:07 am IST

విజువల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఈ భారీ చిత్రం నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ అయింది. అభిమానుల ఆకలిని తీర్చేలా ఉంది ఈ గ్లింప్స్. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్, చరణ్ మాస్ ఎంట్రీతో పాటు అజయ్ దేవగన్, అలియా లుక్స్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి.

ముఖ్యంగా ఈ గ్లింప్స్ లోని టెక్నికల్ వ్యాల్యూస్, అత్యున్నతమైన విజువల్స్ హైలైట్ గా నిలిచాయి. రాజమౌళి ముందుగానే ప్రకటించినట్లు ‘ఆర్ఆర్ఆర్’ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని తీసుకురాబోతున్నాడని ఈ గ్లింప్స్ చూస్తే అర్ధం అవుతుంది.

కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం, చరణ్ అల్లూరి పాత్రల్లో కనిపించబోతున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ వీడియో గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :