స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు భారీ అంచనాలతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. వారి అంచనాలకు తగ్గట్లుగానే ట్రైలర్ అద్భుతంగా ఉంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అండ్ టైమింగ్, బన్నీ శైలి మ్యానరిజమ్స్ అండ్ స్టైల్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. అలాగే తమన్ మ్యూజిక్ తో పాటు అద్భుతమైన విజువల్స్ ఈ ట్రైలర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమా పై భారీ అంచనాను పెంచింది.
కాగా బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ కావడం కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
