వరుస ప్రాజక్ట్స్ తో బిజీగా స్టార్ హీరోయిన్ త్రిష

వరుస ప్రాజక్ట్స్ తో బిజీగా స్టార్ హీరోయిన్ త్రిష

Published on Jun 6, 2023 12:30 AM IST

ఒకప్పుడు స్టార్ నటిగా వెలుగొందిన త్రిష సినీ కెరీర్ కొన్నాళ్ల క్రితం వరకు స్లో అయిపోయింది. కెరీర్ పరంగా ఆమె క్రేజ్ తగ్గిందని కొందరు విమర్శకులు ఆమె పై ఒకానొక సమయంలో విమర్శలు ఎక్కుపెట్టారు. అలానే ఆ సమయంలో ఆమె కూడా టాప్ బ్యానర్‌లతో పాటు ఏ స్టార్ హీరోల సినిమాకి సంతకం చేయలేదు. అయితే అదంతా గతానికి సంబంధించిన విషయం అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం త్రిష తిరిగి కెరీర్ పరంగా పుంజుకుంటూ ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటున్నారు. ఇక త్రిష చివరిసారిగా మణిరత్నం తీసిన మాగ్నమ్ ఓపస్ పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలలో కీలకమైన ప్రధాన పాత్రలో కనిపించింది.

ఇక ఆ రెండు సినిమాల భారీ సక్సెస్ ఆమె భవిష్యత్ ప్రాజెక్ట్‌లకు మరింత మంచి బాట వేసింది. ఇక ప్రస్తుతం త్రిష స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా లియోలో హీరోయిన్ గా నటిస్తున్నారు. తమిళ స్టార్ అజిత్ కుమార్ రానున్న మూవీలో కథానాయికగా ఆమె నటించే అవకాశం ఉంది. అలానే ధనుష్ ప్రతిష్టాత్మక గోల్డెన్ జూబ్లీ మూవీ D50 లో కూడా త్రిష కథానాయికగా నటించడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చివరగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ స్టార్ మోహన్‌లాల్ రాబోయే సినిమా రామ్‌లో కూడా త్రిష నటించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అయితే రానున్న రెండూళ్ల వరకు వరుసగా ప్రాజక్ట్స్ తో కెరీర్ పరంగా మళ్ళీ బిజీ అవుతున్నారు త్రిష.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు