మహేష్ తో దసరాకి స్టార్ట్ చేయనున్న రాజమౌళి ?

Published on Apr 24, 2022 11:24 pm IST

నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. దసరాకి ఈ సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేయాలని.. అప్పటి లోపు స్క్రిప్ట్ పనులు పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ చేశాడట.

కాగా ఇప్పటికే రచయిత విజయేంద్రప్రసాద్‌ మహేశ్‌ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రాశారట. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది.

సంబంధిత సమాచారం :