తమిళ రీమేక్ పై కన్నేసిన హీరో ఆది

aadi
యంగ్ హీరో ఆదికి ఏన్నాళ్లగానో ఎదురుచూస్తున్న విజయం ‘చుట్టాలబ్బాయి’ చిత్రం ద్వారా దక్కింది. ఆ ఉత్సాహంతో ఆది రాబోయే రోజల్లో కొత్త తరహా సినిమాలు, పాత్రలు చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే ఓ సూపర్ హిట్ తమిళ సినిమా ‘ఎట్టి’ పై కన్నేశాడు. తమిళంలో రవి అరస్ తెరకెక్కించిన ఈ చిత్రం రక్త సంబంధిత వ్యాధితో బాధపడే ఓ అథ్లెట్ జీవితంగా తీయబడింది. ఆ చిత్రాన్ని చూసిన ఆది ఆ పాత్రలో తాను సులభంగా ఒదిగిపోగలనని అనుకున్నాడట.

పైగా ఈ చిత్రం యొక్క తెలుగు రీమేక్ ఆఫర్ ఆదిని వెతుక్కుంటూ వచ్చిందట. ఈ విషయాన్ని ఆది స్వయంగా తెలిపాడు. అలాగే ఇప్పటి వరకూ లవర్ బాయ్, మాస్ పాత్రలు చేసిన తాను ఇకపై రియలిస్టిక్ గా ఉండే పాత్రలు చేయాలనుకుంటున్నానని, అందుకే ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్నానని, కానీ ఇంకా సైన్ చేయలేదని తెలియజేశాడు.