యంగ్ హీరో ఆశలన్నీ ఆ సినిమాపైనే..!

CHUTTALABBAYI
సాయి కుమార్ తనయుడిగా సినిమాల్లోకి ఇచ్చిన హీరో ‘ఆది’ ప్రస్తుతం ఖచ్చితంగా హిట్ కొడితేగాని నిలదొక్కుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన నటించిన మొదటి మూడు సినిమాలు ‘ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు’ పర్వాలేదనిపించినా ఆ తరువాత విడుదలైన ‘గాలిపటం, రఫ్, గరం’ వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో హీరో ఆది బాగా వెనుకబడ్డాడు. దీంతో ప్రస్తుతం అతని ఆశలన్నీ తాజాగా నటించిన ‘చుట్టాలబ్బాయి’ చిత్రంపైనే ఉన్నాయి.

అహనా పెళ్ళంటా, పూల రంగడు వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు ‘వీరభద్రం’ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనింగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్లు బ్రహ్మానందం, పోసాని, పృథ్వి, కృష్ణ భగవాన్ లు నటించారు. ఇటీవలే విడుదలైన ఆడియోకి సైతం మంచి రెస్పాన్సే వస్తోంది. ఇక ఆగష్టు నెలలో విడుదలకానున్న ఈ చిత్రం ఏ మేరకు ఆది ఆశలు నెరవేరుస్తుందో చూడాలి.