హిట్ లేకపోయినా స్పీడ్ ఉంది !

Published on Mar 18, 2019 6:18 pm IST

చెప్పుకోవడానికి పెద్దగా హిట్లు లేకపోయినా, సాయికుమార్ ఆది మాత్రం వరుసగా సినిమాలను పట్టాలెక్కించేస్తున్నాడు. ఆ మధ్య 2017లో చేసిన రెండు సినిమాలు కాస్త బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్ గా నిలవడంతో.. సినిమాలకు కొంత గ్యాప్ తీసుకున్నట్లు కనిపించినా.. గతేడాది ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ’ అనే రెండు సినిమాలను అంగీకరించి.. గ్యాప్ లేకుండా షూటింగ్ పాల్గొన్నాడు.

కాగా ఆ రెండు సినిమాలు పూర్తి అవ్వకముందే, ఈ యంగ్ హీరో మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, అలాగే మరో రెండు కథలను లైన్లో పెట్టాడు. మొత్తానికి హిట్ లేకపోయినా ఆదిలో స్పీడ్ ఉందని నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

ఇక ప్రస్తుతం ఆది హీరోగా వేదిక హీరోయిన్ గా కార్తిక్ విగ్నేష్ అనే దర్శకుడి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఎంజీ ఔరా సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ను మార్చి 25వ తేదీ నుండి మొదలు పెట్టనున్నారు.

సంబంధిత సమాచారం :

More