సర్కారు వారి పాట: ట్రైలర్ కి ఇది సరిపోదు అంటున్న అడివి శేష్!

Published on May 2, 2022 5:30 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం లో మహేష్ బాబు మునుపెన్నడూ లేని విధంగా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ట్రైలర్ విడుదల అయిన కొద్ది సేపటికే సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ పై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా హీరో అడివి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది.

ఈ సర్కారు వారి పాట చిత్రం ట్రైలర్ కి ఫైర్ ఏమోజీ సరిపోదు అంటూ చెప్పుకొచ్చారు. మే 12, 2022 న విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, సముద్ర ఖని, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :