‘కాంతారా’ మూవీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అడివిశేష్

‘కాంతారా’ మూవీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అడివిశేష్

Published on Dec 1, 2022 10:10 PM IST


టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పలు విభిన్న రకాల స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకుంటూ వాటితో విజయాలు అందుకుంటూ ప్రేక్షకాభిమానుల నుండి మంచి క్రేజ్ కొనసాగుతున్నారు యువ నటుడు అడివి శేష్. లేటెస్ట్ గా శైలేష్ కొలను దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ హిట్ 2 రేపు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన హీరో అడివి శేష్, లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కాంతారా గురించి ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రసన్నకు ఇంట్రెస్టింగ్ గా సమాధానం ఇచ్చారు. మీరు కాంతారా మూవీ చూసారా, దాని పై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా, నిజానికి తాను ఆ మూవీని కన్నడలో చూశానని, హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి కి పూర్తి క్రెడిట్ ఇవ్వాలన్నారు. ఆద్యంతం అద్భుతంగా ఆకట్టుకునేలా మంచి కాన్సెప్ట్ ని ఎంచుకుని అతడు తెరకెక్కించిన తీరు ఎంతో బాగుందన్నారు. ఆర్ఆర్ఆర్, బాహుబలి, కెజిఎఫ్ వంటి గ్రాండియర్ సినిమాలతో ఢీకొట్టి మంచి స్టోరీ, కాన్సెప్ట్ ఉంటె వాటికి సైతం గట్టి పోటీ ఇవ్వొచ్చని రిషబ్ నిరూపించారని, మొత్తంగా కాంతారా అంత గొప్ప విజయం అందుకున్నందుకు యూనిట్ కి తన తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియచేసారు అడివిశేష్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు