అందుకే నేను నాన్నతో సినిమా చేయలేదు – ఆకాష్‌ పూరి

Published on Jun 9, 2022 2:46 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’. ఈ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న తరుణంలో ఆకాష్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ విశేషాలను సైతం పంచుకున్నాడు ఆకాశ్ పూరీ.

ఓసారి సినిమా షూటింగ్‌ జరుగుతోందని, . ఒక్కసారి చూద్దామని నాన్న గోడ మీద నుంచి ఎగిరెగిరి చూస్తుంటే అక్కడున్న సెక్యూరిటీ లాగిపెట్టి కొట్టి వెళ్లిపోమన్నారు. ఇంట్లో ఖాళీగా ఉన్నావు, పార్ట్‌ టైం జాబ్‌ చూశాను, చేయమన్నారు. అలా ఓ జిమ్‌కు వెళ్లి క్లీనింగ్‌ చేశా. ఆర్థిక సమస్యలతో ఇక్కడ జాబ్‌ చేస్తున్నానన్నాను. కానీ వారికి నేను పూరీ కొడుకు అని తెలిసిపోయింది. ఆంధ్రావాలాలో నాకు పాత్ర ఫిక్సయిపోయింది. సడన్‌గా ఫోన్‌ చేసి నువ్వు చేయట్లేదు అన్నారు. నన్నెందుకు తొక్కేస్తున్నారు అని ఫీలయ్యాను. ఇక సినిమాల విషయానికి వస్తే నాతో సినిమా చేద్దాం అన్న కూడా నో చెప్పాను. పూరీ కొడుకు అనేది పోగొట్టుకున్నాకే నీతో సినిమా చేస్తానని చెప్పానని అన్నాడు.

సంబంధిత సమాచారం :