ఇంటర్వ్యూ : గల్లా అశోక్ – రీమేక్ చేసే ఛాన్స్ వస్తే ‘మురారి’నే చేస్తాను !

ఇంటర్వ్యూ : గల్లా అశోక్ – రీమేక్ చేసే ఛాన్స్ వస్తే ‘మురారి’నే చేస్తాను !

Published on Apr 4, 2022 4:30 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్, దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించిన “హీరో” సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే, అశోక్‌ గల్లా తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ఈ ప్రెస్‌ మీట్‌ లో తన కొత్త సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం.

 

హాయ్ అండి. మీ ఫస్ట్ సినిమా రిలీజ్ అయిపోయింది. ప్రజెంట్ యాక్టర్ గా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?

యా.. ఫస్ట్ సినిమా చేశాను కాబట్టి.. నేను ఇప్పుడు యాక్టర్ ని అని చెప్పుకోవచ్చు. కానీ.. తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అని చాలా ఎగ్జైట్ గా ఉన్నాను.

 

మీ ఫస్ట్ సినిమా విషయంలో.. ఆ సినిమాకి వచ్చిన రిజల్ట్ విషయంలో మీరు పూర్తి హ్యాపీగా ఉన్నారా ?

ఫుల్ హ్యాపీగా ఉన్నారా అంటే… అలా ఏమి లేదు అండి. కారణం.. సంక్రాంతి టైంకి ఉండాల్సిన అంత క్రౌడ్ లేదు అని కొంత డిజ్పాయింట్ అయ్యాను. మార్చిలో వస్తుంది అనుకున్న కరోనా.. చాలా ముందే రావడం మా సినిమాకి కొంత నష్టం కలిగించింది. కానీ, సినిమా కంటే.. జనం సేఫ్టీ ముఖ్యం కదా.

 

మీ ఫస్ట్ సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు మీతో ఏమన్నారు ?

సినిమా చూసిన తర్వాత నిన్ను చూస్తే ప్రౌడ్ గా ఉంది అని చాలా బాగా మెచ్చుకున్నారు. నిజానికి ఆ మాట తర్వాత కూడా ఆయన ఏదో చెప్పారు. కానీ.. నాకు ఇంక ఏమి వినపడలేదు. ప్రౌడ్ అనే మాట ఒక్కటే నాకు గుర్తుండిపోయింది.

 

సినిమాల సెలక్షన్ విషయంలో గానీ, నటన విషయంలో గాని మహేష్ బాబు గారు మీకు ఏమైనా సజెషన్స్ ఇస్తారా ?

ఇస్తారండి. ఫస్ట్ సినిమా విషయంలో కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. ఆయన ప్రతి చిన్న విషయాన్ని చాలా బాగా గమనించి చెబుతారు.

 

మీ నటన విషయంలో మీకు ఇప్పటివరకూ ఎలాంటి ప్రశంసలు వచ్చాయి ?

మంచిగా వచ్చాయి అండి. కొన్ని ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రశంసలు వచ్చాయి. కానీ.. ఎవరైనా సినిమా సినిమాకి తమ నటనను ఇంప్రూవ్ చేసుకోవాలి.

 

సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు ఇది ఎన్నో పుట్టిన రోజు ?

ఇది మూడో పుట్టిన రోజు. సెట్స్ లోనే రెండు పుట్టినరోజులను జరుపుకున్నాను.

 

మీరు కమర్షియల్ సినిమాలే చేయాలని ఏమైనా నియమం పెట్టుకున్నారా ?

అలా ఏమి లేదు అండి. నేను అన్ని జోనర్స్ లో సినిమాలు చేయాలని ఆశ పడుతున్నాను. డ్యాన్స్ అండ్ ఫైట్స్ ఇలా అన్నీ విషయాల్లో బాగా చేయాలని నాకు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కథలను ఎంపిక చేసుకుంటున్నాను.

 

ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మీరు కూడా పాన్ ఇండియా సినిమా చేస్తారా ?

నేను ఫస్ట్ ఒక ఇండస్ట్రీలో స్టాండ్ కావాలి. ఆ తర్వాత పాన్ ఇండియా గురించి ఆలోచించవచ్చు. అయినా సినిమా మార్కెట్ అండ్ బడ్జెట్ అనేవి నిర్మాతకి సంబంధించినవి.

 

మహేష్ బాబు గారు సినిమాల్లో మీరు ఏదైనా సినిమాని రీమేక్ చేయాలని అనుకుంటే ఏ సినిమా చేస్తారు ?

మురారి. అంత అద్భుతమైన కథ మళ్లీ రాకపోవచ్చు. మహేష్ బాబు గారు చాలా గొప్పగా చేశారు. నాకు నిజంగా రీమేక్ చేసే ఛాన్స్ వస్తే.. ఆ సినిమాని చేస్తాను.

 

మీ తదుపరి సినిమా గురించి చెప్పండి ?

ఇంకా ఏ కథను ఫైనల్ చేయలేదు. ప్రస్తుతం ఆ కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను. ఇప్పటికే అయితే.. రెండు కథలు ఉన్నాయి. జూన్ లోపు ఒక కథను ఫైనల్ చేసి మూవీని స్టార్ట్ చేస్తాం’ అంటూ గల్లా అశోక్ ఇంటర్వ్యూ ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు