“హిట్2” పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన బాలకృష్ణ

“హిట్2” పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన బాలకృష్ణ

Published on Dec 4, 2022 8:16 PM IST


ప్రామిసింగ్ హీరో అడివి శేష్ యొక్క క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2 బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 20.1 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. మొదటి వారాంతంలోనే చాలా ప్రాంతాలలో బ్రేక్‌ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా నట సింహం నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞతో కలిసి శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్2 చిత్రాన్ని ప్రత్యేక షో లో చూడటం జరిగింది.

సినిమాను బాగా ఎంజాయ్ చేసిన బాలకృష్ణ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు. అల్టిమేట్ థ్రిల్లర్ అని బాలయ్య పేర్కొన్నారు. వారు బాలకృష్ణను హిట్‌వర్స్‌లో భాగం చేయమని శేష్ ఒక జోక్ చేసాడు. శేష్ వ్యాఖ్యలకు స్మైల్ ఇచ్చిన బాలకృష్ణ, నో చెప్పలేదు. అయితే బాలకృష్ణ హిట్ వర్స్ లో భాగమైతే బావుంటుంది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు