రూమర్స్ కు చెక్ పెట్టిన హీరో !


వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత వరుణ్ తేజ్ చేస్తోన్న సినిమా తొలిప్రేమ. వెంకి అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాసిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ సినిమా తరువాత వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి దర్శకర్వంలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి, అలాగే వెంకటేష్ తో పాటు నటించబోతున్నాడని చెప్పారు కాని తాజాగా ఈ హీరో ఏ సినిమా ఒప్పుకోలేదని ప్రకటించాడు. ఒకవేళ సినిమా అంగీకరిస్తే తనే స్వయంగా ప్రకటిస్తానని వెల్లడించాడు ఈ హీరో.