శివశంకర్ మాస్టర్ వైద్యానికి ధనుష్ ఆర్థిక సాయం..!

Published on Nov 26, 2021 2:33 am IST


ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌కు కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకిందని వైద్యులు చెబుతున్నారు. దీంతో చికిత్సకు తగిన డబ్బు లేకపోవడంతో శివశంకర్‌ కుటుంబసభ్యులు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నటుడు సోనూసూద్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్య ప‌రిస్థితి గురించి తెలుసుకున్నాడు. మాస్టర్ ప్రాణాలు కాపాడేందుకు తనకు చేతనైన సాయం చేస్తానని తెలిపాడు.

అయితే తాజాగా శివశంకర్‌ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న కోలీవుడ్ హీరో ధనుష్‌ వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేశారు. శివశంకర్‌ మాస్టర్, ఆయన్ కుటుంబం త్వరగా కోలుకోవాలని ధనుష్ ఆకాంక్షించారు. ఇదీలా ఉంటే శివశంకర్ మాస్టర్ సతీమణి, పెద్ద కుమారుడికి సైతం కరోనా సోకింది. పెద్ద కుమారుడికి సీరియస్ అయ్యి అపస్మారక స్థితిలో ఉండగా, మాస్టర్ భార్య కరోనాతో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు.

సంబంధిత సమాచారం :