బాలయ్య సినిమాలో రాజశేఖర్ ఒరిజినల్ వాయిస్ !

బాలయ్య సినిమాలో రాజశేఖర్ ఒరిజినల్ వాయిస్ !

Published on Jun 20, 2022 7:05 AM IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. అయితే రాజశేఖర్ ది విలన్ పాత్ర కాదు అట, పక్కా కామెడీ పాత్ర అని, సీనియర్ బాలయ్య పాత్రకు స్నేహితుడిగా రాజశేఖర్ పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది.

పైగా అనిల్ రావిపూడి రాజశేఖర్ ఒరిజినల్ వాయిస్ నే ఈ సినిమాలో పెట్టబోతున్నాడట. కాగా హీరోయిన్ శ్రీలీల కూడా ఈ సినిమాలో నటిస్తోంది. బాలయ్యకి కూతురిగా ఆమె ఈ సినిమాలో నటిస్తోంది. ఇక జులై ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి. అందుకే, అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు