యువహీరోతో దిల్ రాజు సినిమా ఖరారు !

14th, November 2017 - 11:26:45 AM

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘శతమానం భవతి’ సినిమా దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో సినిమా చేయనున్నాడనే టాక్ చాలా కాలం నుండి నడుస్తోంది. ఆ సినిమాకు ‘శ్రీనివాస కళ్యాణం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. ఈ ప్రాజెక్ట్ ను ముందుగా నాగార్జున తో చేద్దాం అనుకున్నారు, ఆ తరువాత ఎన్టీఆర్ తో కొన్ని రోజులు కథా చర్చలు జరిగాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ లో నితిన్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ మద్య దర్శకుడు నితిన్ ను కలవడం సబ్జెక్టు చెప్పడం, హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిపోయాయని సమాచారం. త్వరలో ఈ సినిమా పట్టలేక్కబోతుంది. గతంలో నితిన్ తో దిల్ రాజు ‘దిల్’ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తరువాత వీరిద్దరూ కలిసి సినిమా చెయ్యబోతుండడం విశేషం.