“పుష్ప” సినిమాపై హీరో కార్తీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Jan 11, 2022 10:03 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ “పుష్ప ది రైజ్”. మరి గత డిసెంబర్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం భారీ హిట్ గా నిలవడమే కాకుండా టోటల్ ఇండియన్ వైడ్ సినిమా ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు అందుకుంది. మరి ఇప్పుడు బాలీవుడ్ మరియు పలువురు కోలీవుడ్ స్టార్స్ ఈ సినిమా చూసి తమ స్పందనను తెలియజేస్తుండగా..

కోలీవుడ్ స్టార్ కార్తీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. పుష్ప గా అల్లు అర్జున్ తన పాత్రలో పూర్తిగా ప్రవేశించాడని అరెస్టింగ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసాడని అలాగే సుకుమార్ సార్ అయితే ప్రతి మూమెంట్ ని మనుషులతో ప్రెజెంట్ చెయ్యడంలో టాప్ నాచ్ లో చూపిస్తారు. కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమాకి ఫెంటాస్టిక్ జాబ్ అందించారని తెలిపాడు. మరి దీనికి గాను అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ ధన్యవాదాలు తెలియజేసాడు.

సంబంధిత సమాచారం :