హీరో కార్తి “నా పేరు శివ 2” విడుదల వాయిదా..!

Published on Jan 11, 2022 8:51 pm IST

కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా కబాలి, సార్పట్ట పరంబరై వంటి చిత్రాలతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “నా పేరు శివ 2”. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైన్‌గా స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మాత కె ఇ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో క్యాథరైన్ ట్రెసా కథానాయికగా నటించింది.

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. పరిస్థితులు మెరుగపడిన వెంటనే కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని నిర్మాత కె ఇ జ్ఞానవేల్ రాజా తెలిపారు.

సంబంధిత సమాచారం :