ఇంటర్వ్యూ: హీరో కార్తికేయ – ‘రాజా విక్రమార్క’లో గతంలో ఎప్పుడూ చేయని జానర్ చేశా..!

ఇంటర్వ్యూ: హీరో కార్తికేయ – ‘రాజా విక్రమార్క’లో గతంలో ఎప్పుడూ చేయని జానర్ చేశా..!

Published on Nov 9, 2021 2:28 AM IST

RX 100 ఫేమ్, యంగ్ హీరో కార్తికేయ హీరోగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి. టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ కథానాయికగా కనిపించన్నారు. నవంబర్ 12న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో కార్తికేయ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు చూద్దాం.

రాజా విక్రమార్క సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?

ఇప్పటివరకు కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. ఇప్పటివరకు చేయని స్టైలైజెడ్ యాక్టింగ్ ఉంటుందని, నేను మునుపెన్నడు టచ్ చేయని జానర్.

ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది?

ఇంటెన్స్, నేటివిటీ టైప్‌లో కాకుండా రెండున్నర గంటలు సినిమా కథ బయటకు వెళ్లకుండా, నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఎగ్జైట్‌మెంట్ ఉంటుంది. సినిమాలో ఏదీ ఫోర్స్‌ఫుల్‌గా ఉండదని, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంటుంది.

ఈ సినిమా కథ విని మూడేళ్లు అయ్యిందా?

ఈ సినిమా కథ విని మూడేళ్లు అయ్యిందని, కథ డీల్ చేసిన విధానం, కామెడీ బేస్ చేసుకుని చేసిన యాక్షన్ సినిమా. దర్శకుడి మీద నాకు చాలా నమ్మకం వచ్చిందని, ఆయన ఫస్ట్ మీటింగ్‌లో స్క్రిప్ట్ నరేట్ చేసిన విధానం చూడగానే స్క్రిప్ట్ నచ్చిందని చెప్పాను. సినిమా అవుతున్న కొద్ది మేము ఔట్‌పుట్ చూసుకుంటున్నప్పడు చాలా బాగా వచ్చిందనిపించిందని ఆ నమ్మకంతోనే ఇన్నిరోజులు ఈ సినిమా కోసం ఎదురుచూశాను.

ఇంటర్వ్యూ: హీరో కార్తికేయ – ‘రాజా విక్రమార్క’ టైటిల్ పెట్టమని నేనే చెప్పా..!

ఈ సినిమా టైటిల్ నేనే దర్శకుడికి చెప్పానని, తన ఫోన్‌లో ఏదో చూస్తుంటే స్క్రోల్ అయ్యిందని ఈ పేరు మన సినిమాకు టైటిల్‌గా బాగుంటుందని చెప్పాను. ఒక్కరోజు సమయం తీసుకుని ఈ టైటిల్ నిజంగానే మన సినిమాకు బాగుంటుందని శ్రీ సరిపల్లి చెప్పాడు. వెంటనే సినిమాకు రాజా విక్రమార్క టైటిల్ ఖరారై పోయింది.

ఇందులో ఎన్‌ఐఏ ఏజెంట్ రోల్ చేశారు కదా దీనికోసం ఏదైనా రీసెర్చ్ చేశారా?

ఇది పక్కాగా బార్డర్‌లో చేసిన సినిమా కాదని, ఒక ఎన్‌ఐఏ ఏజెంట్ ఇక్కడికి వచ్చి మిషన్‌లో ఉన్నప్పుడు ఎదురైన ఛాలెంజెస్. ఎలా చేయాలి అని డైరెక్టర్‌తో చేసిన ప్రిపరేషన్స్ మాత్రమేనని నాకు నేనుగా ఎలాంటి ప్రిపరేషన్ కాలేదు. కానీ చిన్న చిన్న వాటిని మాత్రం సెర్చ్ చేశాను.

ఈ సినిమాలో డైలాగులు ఎలా ఉన్నాయి?

సినిమాలో డైలాగులు ఇంపార్టెంట్ అని, కథలో ఉంటూనే కామెడీ, డైలాగ్ జనరేట్ అవుతూ ఎంటర్‌టైన్‌ని ఇస్తుందని, ఈ సినిమాలో ప్రతిదీ కథలో ఉంటూనే జనరేట్ అవుతాయని, ఎక్కడ రెఫరెన్స్ తీసుకుని చేసింది లేది. మెయిన్ కథ, కథ కోసమే డైలాగ్స్ ఉంటాయని అన్నారు.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురుంచి చెబుతారా?

ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో ఒక సినిమా చేస్తున్నానని, క్లాక్స్ అనే ఒక అబ్బాయి డైరెక్షన్‌లో ఓక్ మూవీ, శ్రీదేవి మూవీస్‌లో ఒక సినిమా ఒకే అయ్యింది. అన్ని సినిమాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ జానర్‌ను ఎంచుకుంటూ వెళుతున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు