విజయ్ దేవరకొండ సినిమాలో మాధవన్ ?

విజయ్ దేవరకొండ సినిమాలో మాధవన్ ?

Published on Nov 20, 2022 10:07 PM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – సమంత కలయికలో శివ నిర్వాణతో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో మరో స్పెషల్ రోల్ ఉందట. సెకండాఫ్ లో వచ్చే ఈ కీలక పాత్రలో తమిళ నటుడు మాధవన్ నటిస్తాడట. అయితే, ఈ వార్త పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఒకవేళ ఇది నిజం అయితే.. విజయ్ దేవరకొండ – సమంత మధ్యలో మాధవన్ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.

ఈ సినిమా కథ ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. శివ నిర్వాణ సినిమా అంటేనే హుందాగా ఉండే ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రెస్. అయన గత చిత్రాలు ‘మజిలీ, నిన్ను కోరి’లో హృదయానికి హత్తుకునే ప్రేమ కథలు ఉంటాయి. ఆ తరహాలోనే విజయ్ దేవరకొండ చిత్రం కోసం కూడా మంచి ప్రేమ కథను రాసుకున్నారట శివ నిర్వాణ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు