బ్రేకింగ్: హీరో మహేశ్ బాబుకు కరోనా పాజిటివ్..!

Published on Jan 6, 2022 9:05 pm IST


సూపర్ స్టార్ మహేశ్ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా మగేశ్ బాబు సోషల్‌ మీడియా వేదికగా తెలియచేశాడు. స్వల్ప లక్షణాలు ఉండడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, వైద్య సూచనలు పాటిస్తున్నానని తెలిపాడు. అయితే నాతో సన్నిహితంగా ఉన్న వాళ్లు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించాడు.

కాగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోని వారంతా వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనా సోకినా దాని ప్రభావం తక్కువగా ఉంటుందని చెబుతూ, ప్రతి ఒక్కరూ కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు.

సంబంధిత సమాచారం :