“హీరో” నుంచి ‘బుర్ర పాడవుతాదే’ మాస్ సాంగ్ రిలీజ్..!

Published on Jan 14, 2022 12:32 am IST

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమ‌వుతున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మాస్ సాంగ్ “బుర్ర పాడవుతాదే” సాంగ్ రిలీజ్ అయ్యింది. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఈ పాటను ఆలపించగా, భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. గిబ్రాన్ సంగీతాన్ని అందించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో జగపతిబాబు, నరేశ్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య కీలక పాత్రల్లో నటించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :