“హీరో” కూడా సంక్రాంతికే వచ్చేస్తున్నాడు..!

Published on Jan 2, 2022 1:58 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతూ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న చిత్రం “హీరో”. అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అశోక్‌ గల్లా సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే “ఆర్ఆర్ఆర్” సినిమా రిలీజ్ వాయిదా పడడంతో “హీరో” సినిమాను సంక్రాంతి రేసులోకి తీసుకొచ్చారు మేకర్స్. జనవరి 15న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతి రేసులో ఉన్న రాధేశ్యామ్, బంగార్రాజు వంటి పెద్ద సినిమాలకు “డీజే టిల్లు” మరియు ‘హీరో’ వంటి సినిమాలు ఏ మేరకు పోటీనిస్తాయో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :