సరికొత్త రికార్డ్ ను సెట్ చేసిన అశోక్ గల్లా “హీరో”

Published on Jan 11, 2022 8:01 pm IST

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, అశోక్ గల్లా హీరోగా నటించిన తొలి చిత్రం జనవరి 15న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ ను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి నిన్న విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన రావడంతో పాటు సరికొత్త రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ ట్రైలర్‌ కు కేవలం 24 గంటల్లో 7.3 మిలియన్ వ్యూస్ మరియు 1.1 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఒక డెబ్యూ హీరో కు ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం ఇదే తొలిసారి అని చెప్పాలి.

ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై పద్మావతి గల్లా నిర్మించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం :