ఈ కారణంతో తమ సినిమా ట్రైలర్ లాంచ్ వాయిదా వేసిన “హీరో” యూనిట్!

Published on Jan 9, 2022 10:49 am IST

ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కి రెడీగా ఉన్న పలు చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి పరిచయం అవుతున్న మరో యంగ్ హీరో అశోక్ గల్లా నటించిన చిత్రం “హీరో” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం మంచి బడ్జెట్ తోనే హై వాల్యూస్ తో తెరకెక్కించారు. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ ఈరోజు ఆసక్తికర ట్రైలర్ ని లాంచ్ చెయ్యాలని ఫిక్స్ చేశారు. కానీ నిన్న ఘట్టమనేని కుటుంబంలో ఊహించని విధంగా రమేష్ బాబు అకాల మరణంతో షాక్ తగిలింది.

దీనితో ఈ కారణం చేత మేకర్స్ తమ సినిమా ట్రైలర్ ని వాయిదా వేస్తున్నామని. ఏఈ దురదృష్టకర ఘటన సంభవించడంతో సినిమా యూనిట్ అంతా కూడా తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామని తెలిపారు. అలాగే ఈ ట్రైలర్ తాలూకా కొత్త డేట్ ని తర్వాత అనౌన్స్ చేస్తామని తెలిపారు. మరి ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :