లేటెస్ట్ : యంగ్ హీరో నాగశౌర్య పెళ్లి ఫిక్స్…. వధువు ఎవరంటే ?

లేటెస్ట్ : యంగ్ హీరో నాగశౌర్య పెళ్లి ఫిక్స్…. వధువు ఎవరంటే ?

Published on Nov 10, 2022 4:19 PM IST

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో యువ నటుడిగా ఒక్కో సినిమాతో ఆడియన్స్ లో మంచి క్రేజ్ తో కొనసాగుతున్న హీరో నాగ శౌర్య. ఇటీవల కృష్ణ వ్రిందా విహారి మూవీతో మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుని కెరీర్ పరంగా మంచి జోష్ మీదున్న నాగ శౌర్య మరింత జోరుతో ప్రస్తుతం కొత్త సినిమాలు చేస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, అతి త్వరలో నాగశౌర్య పెళ్లి పీటలెక్కబోతున్నారు. నవంబర్ 20న ఉదయం 11 గం. లకు ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేస్తున్న అనూష శెట్టి తో బెంగళూరు లోని JW మారియట్ హోటల్ లో శౌర్య వివాహం వైభవంగా జరుగనుంది. కాగా నవంబర్ 19న ప్రీ వెడ్డింగ్ మెహంది ఫంక్షన్ జరుగనుంది. అయితే రెండు వేడుకలకు ప్రత్యేకంగా విడివిగా స్పెషల్ డ్రెస్ లు డిజైన్ చేసారు. ఇక రెండు రోజుల ఈ వేడుక బెంగళూరులో ఎంతో గ్రాండ్ లెవెల్లో జరుగనుంది. కొద్దిసేపటి క్రితం ఈ న్యూస్ బయటకు రావడంతో పలువురు ఆడియన్స్, ఫ్యాన్స్, తో పాటు సినీ ప్రముఖులు ఆయనకు ముందస్తు వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. కాగా నాగశౌర్య, అనూష ల ఫోటోలు, అలానే పెళ్లి గురించిన పూర్తి వివరాలు అతి త్వరలో అధికారికంగా బయటకు రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు