దసరా ప్రీ రిలీజ్ వేడుక లో నానీ కీలక వ్యాఖ్యలు

Published on Mar 27, 2023 12:00 am IST

టాలీవుడ్ స్టార్ హీరో, నాచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. మార్చ్ 30, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుక లో హీరో నాని మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దసరా తో మీ గుండెల్ని హత్తుకునే మాస్ చూపిస్తాను, సినిమాకోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అని తెలిపారు. టాప్ లేచిపోయే సినిమా మార్చ్ 30 వ తేదీన మీకు మేము ఇస్తున్నాం, టాప్ లేచిపోయే రెస్పాన్స్ మీరు మాకు ఇవ్వండి అని అన్నారు. ఈ వేడుక లో కీర్తి సురేష్ తో పాటుగా నాని చార్ట్ బస్టర్ హిట్ సాంగ్ కి డాన్స్ వేశారు. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :