శివ పార్వతీ థియేటర్ ఫైర్ యాక్సిడెంట్ పై విచారం వ్యక్తం చేసిన హీరో నాని!

Published on Jan 3, 2022 2:45 pm IST


కూకట్ పల్లి ప్రాంతం పరిధి లోని శివ పార్వతి థియేటర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదం లో దాదాపు రెండు కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఉదయం పూట జరగడం తో ఎలాంటి ప్రాణ హని జరగలేదు. అయితే ఈ ఘటన పై ఇప్పటికే పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేయగా, తాజాగా న్యాచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదిక గా స్పందించారు.

శివ పార్వతి థియేటర్ లో అగ్ని ప్రమాదం గురించి వినడం నిజంగా బాధాకరం అని అన్నారు. ఆ ధియేటర్ లో టక్కరి దొంగ చిత్రం ను మొదటి రోజు పిచ్చి ఆనందం తో చూసినట్లు గుర్తు అంటూ చెప్పుకొచ్చారు. ఎవరూ గాయపడలేదు అని తెలిసి సంతోషిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :