రీమేక్ సినిమాలపై మరోసారి క్లారిటీ ఇచ్చేసిన నాని..!

Published on Dec 23, 2021 1:40 am IST


టాలీవుడ్‌లో బిగ్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఏదో ఒక సినిమాను ఎవరో ఒకరు రీమేక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే న్యాచురల్ స్టార్ నాని మాత్రం అసలు రీమేక్‌ల వైపు చూడడం లేదు. ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న నానికి రీమేక్ సినిమాల విషయానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

దీనిపై నాని స్పందిస్తూ గతంలో నేను చేసిన రెండు రీమేకులు తనకి మంచి పాఠం నేర్పాయని, అందుకే ఆ వైపు వెళ్లదలచుకోలేదని, రీమేకులు నాకు అంతగా సెట్ కావనే విషయం అర్థమైపోయిందని అన్నారు. నేను రీమేకులు చేయడం కంటే, నా సినిమాలు రీమేక్స్ అవుతుండటం సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పాడు. ఇకపై కూడా రీమేకులు చేసే ఆలోచన తనకు లేదనే విషయాన్ని నాని స్పష్టం చేశాడు. కాగా నాని గతంలో రీమేక్ చేసిన భీమిలీ కబడ్డీ జట్టు, ఆహా కళ్యాణం సినిమాలు ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :