విజయ్ తలపతి కోసం హీరో నాని విలన్‌గా మారనున్నాడా?

Published on Sep 30, 2021 2:50 am IST


“మాస్టర్” సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న హీరో తలపతి విజయ్ త్వరలో “బీస్ట్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోని నటీనటులు గురించి టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది.

ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని విలన్ పాత్ర పోశించబోతున్నాడట. ఇప్పటికే “వీ” సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించిన నాని ఇప్పుడు ఈ సినిమాలో ఒక విలన్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్‌గా కీయారా అద్వానీ లేదా రష్మిక మందన్నలలో ఒకరిని ఎంపిక చేసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 27 నుంచి మొదలు కానున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :