దసరా: తన కో స్టార్ తో ఉన్న పిక్ షేర్ చేసిన నాని!

Published on Feb 28, 2023 1:00 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో, నేచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం మార్చ్ 30 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా హీరో నాని ఒక ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. చిన్న కోడిపిల్ల ను అరచేతిలో పెట్టుకొని ఉన్న ఫోటో అది. మై కో స్టార్ అంటూ నాని ఫోటో కి క్యాప్షన్ ఇచ్చారు. దసరా చిత్రం లో ఇందుకు సంబంధించిన సన్నివేశం ఉండే అవకాశం ఉంది. నాని ఫోటో లో నవ్వుతూ ఉండగా, కోడి పిల్ల కళ్ళు మూసుకొని ఉంది. ఈ పోస్ట్ కొద్ది సేపటికే వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ రాగా, హీరో నాని సైతం సినిమా పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

సంబంధిత సమాచారం :