లేటెస్ట్ :’హిట్ – 2′ టీజర్ పై అప్ డేట్ ఇచ్చిన నాని

లేటెస్ట్ :’హిట్ – 2′ టీజర్ పై అప్ డేట్ ఇచ్చిన నాని

Published on Oct 22, 2022 4:30 PM IST

విశ్వక్ సేన్ హిట్ హీరోగా 2020లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న మూవీ హిట్ 1. స్టార్ యాక్టర్ నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ సినిమా రూపొందగా యువ దర్శకుడు శైలేష్ కొలను దీనిని అద్భుతంగా తెరేక్కించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న హిట్ 2 మూవీలో అడివిశేష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ యొక్క రష్ ఇటీవల చూశానని, తన న్యూ అవతార్ అదిరిపోయిందని హీరో అడివిశేష్ నిన్న తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక ట్వీట్ పోస్ట్ చేసారు.

దానిని రీట్వీట్ చేస్తూ హిట్ 2 టీజర్ అతి త్వరలోనే మీ ముందుకు రాబోతోంది అంటూ ఈ మూవీ నిర్మాతగా వ్యవహరిస్తున్న హీరో నాని పోస్ట్ చేయడం జరిగింది. హిట్ 1 ని మించేలా దర్శకుడు శైలేష్ కొలను ఈ మూవీని మరింత అద్భుతంగా తెరకెక్కించారని అలానే మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ కూడా తప్పకుండా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని చెప్తోంది యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు