కేజీఎఫ్2 మైండ్ బ్లోయింగ్ – హీరో నవదీప్

Published on Apr 28, 2022 1:20 pm IST


యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్2. ఈ చిత్రం విడుదల అయిన మొదటి రోజు నుండి సినిమా పై విమర్శలు, ప్రముఖుల, సినీ పరిశ్రమ కి సంబంధించిన వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ లిస్ట్ లోకి హీరో నవదీప్ తాజాగా చేరిపోయారు. ఈ హీరో సినిమా పై ఓ రేంజ్ లో కామెంట్స్ చేశారు.

కేజీఎఫ్2 మైండ్ బ్లోయింగ్ అంటూ చెప్పుకొచ్చారు. బాడీ గూస్ బంప్స్ తో అలిసి పోయింది అంటూ చెప్పుకొచ్చారు. నవదీప్ చేసిన వ్యాఖ్యలు కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :