“జనని” సాంగ్ చూసిన ప్రతీసారి కన్నీళ్లు ఆగడం లేదు – హీరో నిఖిల్

Published on Nov 28, 2021 3:00 am IST


జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “రౌద్రం రణం రుధిరం”. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపధ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నిన్న ఈ సినిమా నుంచి “జనని” అనే సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే.

ప్రేక్షకుల నుంచి విశేష స్పందన దక్కించుకుంటున్న ఈ పాటపై తాజాగా యంగ్ హీరో నిఖిల్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. దేశభక్తిని చాటే విధంగా రూపొందిన జనని పాట తనకు ఎంతగానో నచ్చిందని, ఈ పాటను నేను ఇప్పటివరకు 20 సార్లు చూశానని, చూసిన ప్రతీసారి నాకు కన్నీళ్లు ఆగడం లేదని ట్వీట్ చేశారు. అంతేకాదు దేశం మొత్తాన్ని ఎమోషనల్‌గా దగ్గరచేసే చిత్రం ఇదని, కీరవాణి, రాజమౌళి.. మీరు మరోసారి మమ్మల్ని గర్వపడేలా చేశారని అన్నారు. ఇకపోతే ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా పన్ను మినహాయింపును ఇవ్వాలని నిఖిల్‌ ప్రభుత్వాన్ని కోరాడు.

సంబంధిత సమాచారం :