గన్‌తో భార్యను బెదిరిస్తున్న హీరో నితిన్..!

Published on Nov 5, 2021 2:55 am IST


యంగ్ హీరో నితిన్ తన భార్యను గన్‌తో బెదిరిస్తున్నాడు. అయితే ఎందుకు అలా చేస్తున్నాడని మీరు భయపడకండి.. ఎందుకంటే అతడు భయపెట్టిస్తుంది నిజం గన్‌తో కాదు. దీపావళి పండుగ కద పిల్లలు ఆడుకునే రీల్ గన్‌తో నితిన్ ఆడుకుంటూ తన భార్యను బెదిరిస్తున్నాడు. ఆ రీల్ చప్పుడుకు నితిన్ భార్య శాలిని భయపడుతూ చెవులు మూసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “అంధధూన్’కి రీమేక్‌ ‘మాస్ట్రో’తో అలరించిన నితిన్, ప్రస్తుతం ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే చిత్రంలో హీరోగా నటిసున్నారు. ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :