రామ్ – శివ కార్తీకేయన్ కలయికలో క్రేజీ సినిమా ?

రామ్ – శివ కార్తీకేయన్ కలయికలో క్రేజీ సినిమా ?

Published on Jun 27, 2022 7:01 AM IST


యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఒక అప్ డేట్ ఏమిటంటే.. ఈ సినిమా మల్టీస్టారర్ అట. ఈ సినిమాలో తమిళ హీరో శివ కార్తీకేయన్ కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది. శివ కార్తికేయన్ – హీరో రామ్ కలయికలో రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అట. ఈ సినిమాను కూడా బోయపాటి పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా మలచాలని ప్లాన్ చేస్తున్నాడు.

కాగా ముఖ్యంగా రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. ఆల్ రెడీ అఖండ సినిమాతో బోయపాటి తన ఖాతాలో భారీ హిట్ ను వేసుకున్నాడు. కాబట్టి .. బోయపాటి చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. అన్నిటికీ మించి హీరో ఎవరైనా తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటికి మంచి అనుభవం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు