డైరెక్టర్ లింగుస్వామి పై హీరో రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Jul 2, 2022 3:00 am IST

టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి సక్సెస్ లతో యువత తోపాటు అన్ని వర్గాల ఆడియన్స్ లో బాగా క్రేజ్ కలిగిన యువ హీరోల్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా ఒకరు. లేటెస్ట్ గా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామితో ఆయన నటించిన సినిమా ది వారియర్. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్, కమర్షియల్ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి దీనిని ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. ఇక ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్ నిన్న రాత్రి అనంతపురంలో జరిగింది. బోయపాటి శ్రీను, శివ కార్తికేయన్ కలిసి ఈ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేసారు.

ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ, డైరెక్టర్ లింగుస్వామితో పనిచేయడం ఎంతో కొత్త అనుభూతిని ఇచ్చిందని, ముఖ్యంగా అంత మంచి మనసున్న వ్యక్తిని తాను ఇప్పటివరకు చూడలేదన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం వస్తున్న పలు మాస్, కమర్షియల్ చిత్రాలకు స్ఫూర్తి లింగుస్వామి గారే అనే విషయాన్ని కొందరు డైరెక్టర్లు తనతో చెప్పారని అన్నారు. సీమ అంటేనే తనకి సొంత ఇల్లు అనే భావన కలుగుతుందని అన్నారు రామ్. ఇక హీరోయిన్ కృతి శెట్టి, విలన్ గా నటించిన ఆదిలతో పని చేయడం బాగుందని, తప్పకుండా ది వారియర్ మూవీ అందరి అంచనాలు అందుకుని మంచి సక్సెస్ అందుకుంటుందని రామ్ ఆశాభావం వ్యక్తం చేసారు. కాగా ఈ మూవీ జులై 14న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :