అట్లీ – షారుఖ్ ఖాన్ “జవాన్” పై రామ్ పోతినేని ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Jun 3, 2022 10:30 pm IST

అట్లీ దర్శకత్వం లో షారుఖ్ ఖాన్ హీరోగా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక చిన్న వీడియో గ్లింప్స్ ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో లో షారూఖ్ ఖాన్ లుక్ తో పాటుగా, టైటిల్ ను ప్రకటించడం జరిగింది. జవాన్ టైటిల్ తో షారుఖ్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది జూన్ 2 న రానున్నారు.

తాజాగా ఈ వీడియో పై టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. చార్మింగ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఇంత భయంకరం గ కనిపిస్తారు అనుకోలేదు. ఇది కిల్లర్ అంటూ చెప్పుకొచ్చారు రామ్. నీ గురించి చాలా గర్వంగా ఉంది బ్రదర్ అంటూ అట్లీ పై ప్రశంసల వర్షం కురిపించారు. షారుఖ్ ఖాన్ లుక్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుంచి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :