దాని ముందు ‘బాహుబలి – ది బిగినింగ్’ చిన్నదంటున్న రానా !

14th, October 2016 - 12:56:10 PM

rana1
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం గురించి నటుడు రానా మాట్లాడుతూ ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ తో పోల్చుకుంటే ‘బాహుబలి – ది బిగినింగ్’ చిత్రం చిన్నదన్నారు. ఎందుకంటే పోరాట సన్నివేశాలు అందులో కన్నా ఇందులో ఎక్కువగా ఉంటయాని, గొప్పగా అనిపిస్తాయని చెప్పారు. మొదటి పార్ట్ చూసిన ప్రేక్షకులు ఈ రెండవ పార్ట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారని, వాటిని ఈ చిత్రం 100 శాతం అందుకుంటుందని అన్నారు.

అలాగే ఈ సినిమా కోసం తాను చాలా కష్టపడ్డానని, ఫిట్ గా ఉన్నప్పటికీ ఇంకా బలంగా, భారీగా కనిపించాలని రాజుగారు చెప్పేసరికి 8 నెలల కష్టపడి బాడీని పెంచుకున్నానని అన్నారు. ఈ మధ్యే రానా తాను జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఫోటోలను ట్విట్టర్లో వదిలి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను 2017 ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారు.