అలియా ప్రెగ్నెన్సీ విషయం చెప్పినప్పుడు రణబీర్ రియాక్షన్ ఇదే!

Published on Jul 8, 2022 9:00 pm IST

అలియా భట్ మరియు రణబీర్ కపూర్ లు బాలీవుడ్ లో మోస్ట్ ఫేమస్ కపుల్. కొద్దిరోజుల క్రితమే ప్రెగ్నన్సీ ప్రకటించి అభిమానులను ఆనందపరిచారు. ఇప్పుడు, రణబీర్ ఒక ఇంటర్వ్యూలో అలియా ప్రెగ్నెన్సీ విషయం పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

అలియా తన ప్రెగ్నెన్సీ విషయం ను వెల్లడించినప్పుడు తాను చాలా సంతోషిస్తున్నానని మరియు ఈ జంట వారి వివాహం అయిన వెంటనే బిడ్డను ప్లాన్ చేస్తున్నందున ఆశ్చర్యపోనవసరం లేదని వెల్లడించాడు. ఏ జంటకైనా తల్లిదండ్రులు కావడమే బెస్ట్ ఫీలింగ్ అని కూడా రణబీర్ అంటున్నాడు. అతను ఆలియాతో చాలా మంది పిల్లలను కోరుకుంటున్నానని మరియు ఆమెతో చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతానని చెప్పాడు. బాలీవుడ్ నటుడు చేసిన వ్యాఖ్యల తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :