స్వప్న సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న అప్‌కమింగ్ మూవీ ‘ఛాంపియన్’ ఇప్పటికే ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ స్వరపరిచిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ చార్ట్బస్టర్లుగా నిలిచాయి. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరో రోషన్ సినిమా విశేషాలను పంచుకున్నారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రామ్ చరణ్ మిమ్మల్ని చాలా ప్రశంసించడం ఎలా అనిపించింది?
చాలా ఆనందంగా ఉంది. చరణ్ అన్న నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నా గురించి మా సినిమా గురించి టీం గురించి ఆయన చాలా బాగా మాట్లాడారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది.
ఈ క్యారెక్టర్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?
నేను మామూలుగా తెలుగు మాట్లాడతాను. అయితే ఈ క్యారెక్టర్ ప్రాపర్ హైదరాబాది. ఆ యాస స్పష్టంగా నేర్చుకోవడం జరిగింది. మా డైరెక్టర్ హెల్ప్ తో పాటు వర్క్ షాప్స్ కూడా చేశాం.
ఛాంపియన్ యాక్షన్ గురించి?
పీటర్ గారు అద్భుతమైన యాక్షన్ డిజైన్ చేశారు. షూటింగ్లో నాకు కొన్ని గాయాలు కూడా అయ్యాయి. అయితే యాక్షన్ సినిమా అంటే ఇలాంటివి మామూలే.
ఈ సినిమాకి ఎలాంటి రిఫరెన్స్ తీసుకున్నారు?
ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా హైదరాబాద్ కి స్వతంత్రం రాని రోజుల్లో జరిగిన కథ ఇది. మా డైరెక్టర్ గారు అన్ని రిఫరెన్సులు ఇచ్చారు. స్వప్న గారు చాలా పర్టికులర్ గా ఉంటారు. డైరెక్టర్ గారు, స్వప్న గారు, ఆర్ డైరెక్టర్ తోట గారు ప్రతిదీ రీసెర్చ్ చేశారు. ఆ కాలంలో ఎలా ఉండేవారు డైరెక్టర్ గారు ప్రతీది కేర్ తీసుకుని చేశారు. ఈ సినిమా కోసం చాలా వర్క్ షాపులు కూడా చేశాము. ఇందులో అద్భుతమైన డ్రామా ఉంది. ప్రతి దానికి ఒక కనెక్షన్ ఉంటుంది.
హీరోయిన్ అనస్వర గురించి?
ఇందులో హీరో హీరోయిన్ మధ్య డ్రామా అనే కాన్సెప్ట్ తో చాలా మంచి ఫన్ ఉంటుంది. అనస్వర మలయాళంలో దాదాపు 25 సినిమాలు చేసింది. చాలా ఎక్స్పీరియన్స్. తన క్యారెక్టర్ లో చాలా డెప్త్ ఉంటుంది. హీరో పర్పస్ ని ఫుల్ ఫిల్ చేస్తుంది.
మ్యూజిక్ గురించి?
ఇందాకే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూసి వచ్చాను. ఇందులో ఒక కొత్త మిక్కీ జే మేయర్ ని చూస్తారు. యాక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. యాక్షన్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా ఉంటుంది.
కళ్యాణ్ చక్రవర్తి గారి పాత్ర ఎలా ఉంటుంది?
బైరాన్ పల్లి గ్రామంలో ఒక నిజమైన పాత్ర స్ఫూర్తితో రాసుకున్న క్యారెక్టర్ అది. ఆయనతో కలిసి నటించడం చాలా గొప్ప అనుభూతి. ఆయన డాక్టర్ కూడా. చాలా విషయాలు పంచుకునేవారు. నిజంగా ఇది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్.
డైరెక్టర్ ప్రదీప్ గురించి?
ప్రదీప్ గారిది వరంగల్. నేచురల్ గానే ఆయనకి ఆ ఎమోషన్ వచ్చేస్తుంది. ఆయన ఎంచుకున్న ప్రతి నటీనటులు ఈ కథకు పర్ఫెక్ట్ యాప్ట్.
ఛాంపియన్ ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది?
ఇందులో చాలా మంచి హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. ఊర్లో ఉండే ఎమోషన్స్ ఛాంపియన్ లో చాలా అద్భుతంగా చూపించారు. ఆ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది.
మీరు చేయబోయే కొత్త సినిమా గురించి?
త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుంది. ఈసారి ఎక్కువ గ్యాప్ లేకుండా కనీసం రెండు సంవత్సరాలకి మూడు సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.
