బిగ్‌బాస్ 5: హీరో సందీప్ కిషన్ సపోర్ట్ ఎవరికంటే?

Published on Sep 30, 2021 2:01 am IST


బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 5 రసవత్తరంగా జరుగుతుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లోపలికి వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుతం హౌస్‌లో 16 మంది సభ్యులు ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్‌కు నటరాజ్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, ఆనీలు నామినేషన్‌లో ఉన్నారు. ఇది పక్కన పెడితే ఈ సీజన్‌లో మిస్టర్‌ కూల్‌గా పేరు తెచ్చుకున్న బుల్లితెర నటుడు మానస్‌ నాగులపల్లికి యంగ్ హీరో సందీప్ కిషన్ నుంచి సపోర్ట్ లభించింది.

అయితే బిగ్‌బాస్‌ షో ప్రారంభానికి ముందే సందీప్‌ కిషన్‌ మానస్‌కు సపోర్ట్‌ చేయమని అభ్యర్థిస్తూ ఓ వీడియో చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. బిగ్‌బాస్‌ షోలో నాకు నచ్చిన, బాగా కావాల్సిన వ్యక్తి మానస్‌ నాగులపల్లి అని, అందరి మనసులు గెలుచుకుని మానస్ బయటకు వస్తాడని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ మానస్ అని సందీప్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :