ఆ స్టార్ హీరోల డైలాగ్ లని చెప్పిన సత్యదేవ్!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వివి గోపాల కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా కృష్ణమ్మ. మే 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా, హీరో సత్యదేవ్ పలువురు స్టార్ హీరోల వాయిస్ ను అనుకరించారు.

మాస్ మహారాజ రవితేజ, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ ల డైలాగ్ లని చెప్పి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ ట్రైలర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. అర్చన, కృష్ణ బురుగుల, అతిర రాజ్, లక్ష్మన్ మీసాల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ను అరుణాచల క్రియేషన్స్ పతాకంపై నిర్మించగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version