వైరల్ : ఆ మంత్రులు అందరికీ హీరో సిద్ధార్థ్ సంచలన ప్రశ్న..!

Published on Dec 24, 2021 7:08 am IST

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితిలు నెలకొన్నాయో చూస్తూనే ఉన్నాము. టికెట్ ధరల విషయంలో గత కొంత కాలం నుంచి రచ్చ నడుస్తూనే ఉంది. ఇక నిన్న వచ్చేసరికి నాచురల్ స్టార్ నాని చేసిన కామెంట్స్ తో మళ్లీ ఈ ఇష్యూ పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఎన్నో లాజిక్స్ తో ఇప్పటికీ ఈ సమస్యపై చర్చలు గరంగరంగానే నడుస్తున్నాయి. అయితే ఈ ఇష్యూ పైనే హీరో సిద్ధార్థ్ కూడా గత కొన్ని రోజుల నుంచి తన గళం ఎత్తుతున్నాడు.

ఇప్పుడు కూడా ఇలాంటి సంచలన స్టేట్మెంట్ నే మళ్లీ చేసాడు. మంత్రులు ఎవరైతే ఈ టికెట్ ధరలు కోసం మాట్లాడుతున్నారో.. సినిమా కాస్ట్ తగ్గించి కస్టమర్స్ కి డిస్కౌంట్ ఇస్తున్నారో.. మేము ప్రజలు మా టాక్సులతో మీ అన్ని లగ్జరీలకు కారణం అయ్యాం. మా డబ్బుతో మీరు అవన్నీ అనుభవిస్తున్నారు. లక్షలాది కోట్లు అవినీతి చేసి సంపాదించుకొని అనుభవిసున్నారు. మరి మీ లగ్జరీల ను కూడా తగ్గించుకొని మాకు డిస్కౌంట్ ఇవ్వొచ్చు కదా అని సంచన ట్వీట్ తో లాజిక్ మాట్లాడారు. దీనితో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :